భారతదేశం, ఏప్రిల్ 22 -- Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజుని బ్లాక్‌మెయిల్ చేసిన తనకు నచ్చిన పనులు చేయించుకుంటుంది ఇందు. అంతేకాదు అతన్ని హగ్ కూడా చేసుకుంటుంది. దీంతో రాజు కూడా మెల్లగా ఇందు ప్రేమలో పడిపోతుంటాడు. అటు వెంకీ మరో ప్రేమ కోసం నందుని వాడుకోవాలని డిసైడవుతాడు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 22) ఎపిసోడ్ ఇంటి ఓనర్ ను రాజు, ఇందు, లక్కీ బోల్తా కొట్టించే సీన్ తో మొదలువుతుంది. ఇందుని చూసి ఆమె ఎవరు అని అడుగుతాడు ఓనర్. కానీ అక్కడ అమ్మాయి లేదని, అది తానే అని లక్కీ అంటాడు. బాగా తాగి ఉండటంతో ఓనర్ కళ్లు మసకగా మారతాయి. ఇంతకుముందు ఎవరితో మాట్లాడారు అని అడిగితే తన భార్యతో అని అతడు అంటాడు.

అందుకే అలా కనిపిస్తున్నానని లక్కీ అంటాడు. నా భార్య చెండాలంగా ఉంటుంది.. కానీ ఈ అమ్మాయి కత్తిలా ఉంది అని ఓనర్ అంటాడు. ...