భారతదేశం, ఏప్రిల్ 14 -- Brahmamudi April 14th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు కిడ్నాప్ కేసులో నందు విచారణ మొదలుపెడుతుంది. దుగ్గిరాల ఇంటికి వచ్చి అక్కడే కిడ్నాపర్లను పట్టుకోవడానికి కావాల్సిన సెటప్ ఏర్పాటు చేస్తుంది. పనిలో పనిగా భ్రమరాంబతో ఆడుకుంటుంది. అటు ఇందుని కిడ్నాప్ చేసిన రాజు.. రేఖకు ఫోన్ చేసి కోటి డిమాండ్ చేస్తాడు.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 14) ఎపిసోడ్ ఇందు కిడ్నాప్ కేసులో విచారణ మొదలుపెట్టడానికి నందు దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టే సీన్ తో మొదలవుతుంది. వచ్చీ రాగానే ఆమె రేఖతోపాటు భ్రమరాంబతో దురుసుగా మాట్లాడుతుంది. వాళ్లపైనే అనుమానం ఉన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇందు కిడ్నాప్ కేసును ఛేదించడానికి వచ్చామని, తనకు ఓ పూర్తి సెటప్ కావాలంటూ అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తుంది.

ఇందు బయట ఉంటే ఇంటికి ఎందుకు వచ్చా...