భారతదేశం, అక్టోబర్ 23 -- Bollywood: భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). ఐకానిక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దశాబ్దాలుగా అలరిస్తున్నప్పటికీ, తనలో ఉన్న అసలైన నటుడిని చిత్ర పరిశ్రమ ఇంకా పూర్తిగా వాడుకోలేదని ఆయన భావిస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న 'స్టీరియో టైపింగ్' (ఒకే తరహా పాత్రలలో నటులను బంధించడం) సంస్కృతిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat) సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ 'జూమ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హిందీ చిత్ర పరిశ్రమపై నిప్పులు చెరిగారు.

బాలీవుడ్‌లో నటీనటులకు ఎదురవుతున్న వివక్ష, టైప్‌కాస్టింగ్ గురించి మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ....