భారతదేశం, నవంబర్ 24 -- Blast Tv Premiere: ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పెను విధ్వంసం క్రియేట్ చేసిన చిన్న సినిమాల్లో 'బ్లాస్ట్' పేరు కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు టీవీలోకి రాబోతుంది.

తమిళ సినిమాగా తెరకెక్కిన 'బ్లాస్ట్' మూవీ తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇప్పుడు టీవీలోకి రాబోతుంది. ఈ ఆదివారం (నవంబర్ 29) సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ఈ సినిమా ప్రీమియర్ కానుంది.

బ్లాస్ట్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవాళ (నవంబర్ 24) ఇవాళ వచ్చేసింది. ఈ సినిమా ఆదివారం సాయంత్ర...