భారతదేశం, అక్టోబర్ 14 -- పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు మాటలు చెబితే, మరికొందరు చేతల్లో చూపిస్తారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌధరి అలియాస్ 'బిట్టూ తబాహి' రెండో కోవకు చెందిన వ్యక్తి! ఎలాంటి ఆధునిక యంత్రాలు, ప్రభుత్వ సాయం లేకుండా ఒంటరిగానే అజ్నార్ నదిలోని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొలగించడానికి ఎనిమిది నెలల పాటు అహర్నిశలు శ్రమించాడు. అయితే, ఇటీవల నదీ తీరానికి వెళ్లిన అతడికి తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానికులు మళ్లీ నదిని ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేయడంతో ఎనిమిది నెలల శ్రమ కొన్ని వారాల్లోనే బూడిదలో పోసిన పన్నీరైంది.

నది మళ్లీ చెత్తమయంగా మారిన దృశ్యాలను బిట్టూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. "ఎనిమిది నెలల నా కష్టం ఇలా వృథా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు," అని బిట్టూ తీవ్ర ఆవేదన వ...