భారతదేశం, అక్టోబర్ 11 -- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం.. ప్రపంచవ్యాప్త క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ను కుప్పకూల్చింది! చైనా నుంచి దిగుమతి చేసుకునే "క్రిటికల్​ సాఫ్ట్‌వేర్" ఉత్పత్తులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత బిట్‌కాయిన్, ఈథీరియం సహా దాదాపు అన్ని ప్రముఖ క్రిప్టో కరెన్సీల ధరలు భారీగా పడిపోయాయి.

మీడియా నివేదిక ప్రకారం.. తయారీ రంగంలో, ముఖ్యంగా సాంకేతిక (టెక్నాలజీ) రంగంలో కీలకమైన రేర్​ ఎర్త్​ మినరల్స్​ ఎగుమతులను పరిమితం చేస్తామని చైనా ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్​ ఈ టారీఫ్​ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ రాజుకునట్టు అయ్యింది.

కాయిన్‌మార్కెట్‌క్యాప్ ప్రకారం.. ఉదయం 6:10 గంటలకు బిట్‌కాయిన్ ధర 7.60 శాతం క్షీణించి $1,12,592.31 వద్ద ట్రేడ...