భారతదేశం, ఆగస్టు 24 -- భారతీయ టూ-వీలర్ మార్కెట్లో 100 సీసీ ఎంట్రీ-లెవెల్ బైకులకు ఉండే క్రేజే వేరు. తక్కువ ధర, అద్భుతమైన మైలేజీ, రోజువారీ ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ సెగ్మెంట్‌లో హీరో స్ల్పెండర్ ప్లస్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 బైకులు టాప్‌లో ఉన్నాయి. మరి.. నమ్మకానికి మారుపేరైన హీరో స్ల్పెండర్, బడ్జెట్ ఫ్రెండ్లీ హోండా షైన్, లాంగ్ రైడ్ కంఫర్ట్ ఇచ్చే బజాజ్ ప్లాటినాలో ఏది కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ మూడు బైకులకు నెలవారీ ఈఎంఐ ఎంత పడుతుందో ఇక్కడ చూద్దాము..

ఈ మూడు పాపులర్ మోడళ్ల ఈఎంఐ లెక్కలను అంచనా వేయడానికి వాటి అన్ని వేరియంట్లను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

హీరో స్ల్పెండర్ ప్లస్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం.. స్ల్పెండర్ ప్లస్ ర...