భారతదేశం, ఏప్రిల్ 4 -- Biker vs Raakaasaa: గుడ్ ఫ్రైడే సందర్భంగా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు మొదలైంది. ఒకవైపు అనుభవం ఉన్న స్టార్ హీరో శర్వానంద్ 'బైకర్' (Biker) మూవీతో పలకరించగా.. మరోవైపు యువ నటుడు సంగీత్ శోభన్ 'రాకాస' (Raakaasaa)తో థియేటర్లలోకి వచ్చాడు. అయితే మొదటి రోజు బుకింగ్స్, టికెట్ సేల్స్, బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తుంటే చిన్న సినిమా అయిన 'రాకాస' పెద్ద సినిమాపై పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.

తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్ల పరంగా చూస్తే బైకర్ పై రాకాస స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బాక్సాఫీస్ ట్రాకర్ Sacnilk ప్రకారం చూస్తే.. రాకాస తొలిరోజు గ్రాస్ వసూళ్లు రూ.2.99 కోట్లుగా ఉన్నాయి. వీటిలో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.2.6 కోట్లు కావడం విశేషం. ఓ చిన్న సినిమా ఇది నిజంగా భారీ ఓపెనింగే అని చెప్పాలి.

మరోవైపు బైకర్ కలెక్షన్ల విషయానికి వస్తే...