భారతదేశం, ఆగస్టు 14 -- Bigg Boss Uppal Balu: ఇటీవలే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఆడిషన్స్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పల్ బాలు.. సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష నుంచి తనను ఎలిమినేట్ చేయడంపై మండిపడ్డాడు. ముఖ్యంగా నవదీప్ కు శాపం పెట్టారు.

డిఫరెంట్ వీడియోస్ తో సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు తెగ పాపులర్ అయ్యారు. నెటిజన్లకు అతని పేరు పరిచయమే. ఈ ఉప్పల్ బాలు తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షకు వెళ్లారు. అతనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. అయితే అగ్నిపరీక్ష నుంచి అతను ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ కావడంతో ఉప్పల్ బాలు ఫుల్ ఫైర్ అయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ వీడియో పోస్టు చేశారు. ఇందులో బిగ్ బాస్ మేకర్స్, ముఖ్యంగా జడ్జ్ గా ఉన్న నవదీప్ పై బాలు సంచలన ...