భారతదేశం, అక్టోబర్ 11 -- Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారం ముగింపులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ జరగడంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన అపూర్వ, అలాగే రీ-ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇద్దరూ ఒకేసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఆడియన్స్ ఓటింగ్ తక్కువగా ఉండటంతో వీరిద్దరి ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ముగిసింది.

'అగ్ని పరీక్ష' షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హౌస్‌లోకి కామనర్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అపూర్వ అడుగుపెట్టింది. ఈ వారంతో ఆమె జర్నీ ముగిసింది. అపూర్వకు వారానికి దాదాపు రూ.75 వేల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలిసింది. ఆమె హౌస్‌లో మూడు వారాల పాటు కొనసాగడంతో మొత్తంగా రూ.2.25 లక్షల వరకు పారితోషికం దక్కించుకున్నట్లు సమాచారం. అంతకుముందు అగ్నిపరీక్ష ...