భారతదేశం, అక్టోబర్ 10 -- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటివరకూ హౌస్ లో జరుగుతున్న రచ్చకు ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ అనేది యాడ్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అపూర్వ, శాలిని, రోహిత్ మధ్య రిలేషన్ షిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా శాలిని ఓ సీక్రెట్ బయటపెట్టింది.

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లోకి అపూర్వ వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన తర్వాత ఓ మంచి అబ్బాయి ఉంటే చూడమని రాంప్రసాద్ కు అపూర్వ చెప్పింది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా శనివారం (అక్టోబర్ 10) ప్రోమోలో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై రాంప్రసాద్ ను నాగార్జున అడగ్గా.. శాలిని సంచలన విషయం చెప్పింది.

అపూర్వ బిగ్ బాస్ హౌస్ లోకి లవ్ కంటెంట్ కోసమే వచ్చిందనే అర్థం వచ్చేలా శాలిని మాట్లాడింది. అపూర్వ రాగ...