భారతదేశం, అక్టోబర్ 5 -- Bigg Boss 10 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా లాస్ట్ వీక్ లో అయితే హౌస్ లో రచ్చ మామూలుగా లేదు. కంటెస్టెంట్లు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఇంకా ఎంతో డ్రామా జరిగింది. వీకెండ్ వచ్చిన నాగార్జున అందరికీ క్లాస్ పీకి వెళ్లారు.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మళ్లీ నామినేషన్ రచ్చ మొదలైంది. అయిదో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగిందని టాక్. కంటెస్టెంట్ల ఒకరి తప్పులను మరొకరు చెప్తూ, మాటల యుద్ధానికి దిగారని సమాచారం. ఈ వారం హౌస్ నుంచి ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది.

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ అయిదో వారంలో త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయ్యారని సమాచారం. అంతే కాకుండా ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ఉంటుందని టాక్. ఎం...