భారతదేశం, నవంబర్ 8 -- Bigg Boss 10 Elimination: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' తొమ్మిదో వారం మరింత ఆసక్తికరంగా మారింది. నామినేషన్స్, టాస్కులు, గొడవలతో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎలా ఉన్నా.. వీకెండ్ వచ్చేసరికి ఎలిమినేషన్ టెన్షన్ అందరిలోనూ మొదలవుతుంది. కానీ ఈసారి కింగ్ నాగార్జున కంటెస్టెంట్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో ఎలాంటి ఎలిమినేషన్ ఉండదని తెలిసింది. దీపావళి పండుగ స్పెషల్‌గా ఈ వీకెండ్‌ను పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దసరా పండుగ సమయంలో ఎలాగైతే ఎలిమినేషన్ రద్దు చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారో.. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవ...