భారతదేశం, అక్టోబర్ 31 -- Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss Telugu 10) రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు, వారం వారం సరికొత్త ట్విస్ట్‌లతో కింగ్ నాగార్జున ఈ షోను మరింత రక్తికట్టిస్తున్నారు. ఎప్పుడెవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో, ఎవరు కెప్టెన్ అవుతారో ఊహించడం కష్టంగా మారింది. అయితే, తాజాగా జరిగిన ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేసేలా ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న సింగర్ ఝాన్సీ ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సీజన్ 10లో సింగర్‌గా, రైతు బిడ్డగా హౌస్‌లోకి అడుగుపెట్టింది ఝాన్సీ. మొదటి వారం నుంచే తనదైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫిజికల్ టాస్క్‌ల పరంగా ఏమాత్రం తగ్గకుండా ఆడుతూ,...