భారతదేశం, సెప్టెంబర్ 4 -- Bigg Boss 10 Contestants: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' (Bigg Boss Telugu 10) గ్రాండ్ లాంచ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కొత్త సీజన్ సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ సారి 'దశావతారం' థీమ్‌తో రాబోతున్న ఈ షోలోకి అడుగుపెట్టే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రతి బిగ్ బాస్ సీజన్ ప్రారంభానికి ముందు కంటెస్టెంట్లు ఎవరన్న చర్చ సహజంగానే జరుగుతుంది. తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉంటాయి. షో ఆర్గనైజర్లు మాత్రం చివరి నిమిషం వరకు పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడినా.. ఏదో ఒకరకంగా లీకులు అవుతూనే ఉంటాయి. అలా ఈసారి కూడా కొందరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు...