భారతదేశం, సెప్టెంబర్ 7 -- Bigg Boss 10 Buzz: బిగ్ బాస్ సీజన్ 7లో తనదైన నైజంతో, పంచ్‌లతో ప్రేక్షకులను అలరించి టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన శివాజీ.. మరోసారి హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తారు. గత సీజన్ లో బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లతో నిజాలు రాబట్టిన ఆయన.. మరోసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేందుకు బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఇది స్టార్ మా మ్యూజిక్ లో ప్రసారమవుతుంది. ఈ బజ్ కు ప్రతి సీజన్ కు హోస్ట్ లు మారుతూ వచ్చారు. అంతకుముందు సీజన్లోని స్టార్ కంటెస్టెంట్లు తర్వాతి సీజన్ బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ లుగా చేశారు. కానీ శివాజీ మాత్రం వరుసగా హోస్ట్ గా కొనసాగుతుండటం విశేషం.

బిగ్ బాస్ బజ్ లో తనదైన డైనమిజంతో కంటెస్టెంట్లను వణికి...