భారతదేశం, జూన్ 27 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెర వీక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు తన 10వ సీజన్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త టాస్క్‌లు, క్రేజీ సెలబ్రిటీలతో ఇంట్రెస్టింగ్ గా మార్చాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే గ్లామర్, టాలెంట్, మంచి వాక్చాతుర్యం ఉన్న పాపులర్ ముఖాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో తన యాంకరింగ్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వింధ్య విశాఖ (Vindhya Vishaka Medapati) ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ప్రచారం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ 10 తెలుగులోకి ఆమె అడుగుపెట్టడం ఖాయమంటున్నారు.

ప్రస్తుతం...