భారతదేశం, ఆగస్టు 28 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెర వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు' 10 సీజన్ ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మైల్‌స్టోన్ 10వ సీజన్ వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. సెప్టెంబర్ 6న ఈ షో గ్రాండ్ లాంచ్ కానుందని సమాచారం.

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ టైమ్ దగ్గరపడుతుండటంతో కంటెస్టెంట్ల లిస్ట్ తెగ వైరల్ గా మారుతోంది. సెలబ్రిటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారనే దానిపై రూమర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ కావడంతో ఈ సారి కాన్సెప్ట్, టాస్కులు, గ్లామర్ డోస్ పరంగా షో నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని తెలిసింది.

ఈ క్రమంలో బిగ్‌ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల జాబితాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది....