భారతదేశం, ఆగస్టు 25 -- Bigg Boss 10: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' (Bigg Boss 10 Telugu) కంటెస్టెంట్ల పేర్లపై ప్రచారం జోరందుకుంది. తాజాగా 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా తెలుగు ఇళ్లలో సుపరిచితుడైన కమెడియన్ నరేష్ (జబర్దస్త్ నరేష్) హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లు టాక్ వినిపిస్తోంది.

రియాలిటీ షోలలో గొడవలు, డ్రామా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన వినోదాన్ని అందించే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికే జబర్దస్త్ నరేష్‌ను మేకర్స్ రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.

టీవీలో సీరియల్ అయినా రియాలిటీ షో అయినా టీఆర్పీ రేటింగ్స్ రాబట్టడంపైనే ఫోకస్ చేస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో కూడా అదే బాటలో...