భారతదేశం, ఆగస్టు 9 -- Bigg Boss 10: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న 'ఆటో' రాంప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి అతను చేసిన స్కిట్లు బుల్లితెరపై సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. స్వయంగా రచయిత కూడా అయిన రాంప్రసాద్, తక్కువ సమయంలోనే ఆన్-ది-స్పాట్ 'ఆటో పంచ్‌ల'తో అభిమానుల మనసు దోచుకున్నాడు.

సుదీర్ఘకాలంగా బుల్లితెరపై నవ్విస్తున్న రాంప్రసాద్.. ఇప్పుడు తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో 'బిగ్‌బాస్' రాబోయే సీజన్ 10 కోసం నిర్వాహకులు అతణ్ని సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, రాంప్రసాద్ కూడా ఈ ఆఫర్‌ పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తో...