భారతదేశం, జూన్ 12 -- Bigg Boss: ఇండియాలో హిందీలో స్టార్ట్ అయి, క్రమంగా రీజినల్ లాంగ్వేజ్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ కొత్త సీజన్ రాబోతుంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ హిందీ సీజన్ సెప్టెంబర్ 21న స్టార్ట్ అవుతుందనే బజ్ వినిపిస్తోంది. మరి తెలుగు సీజన్ ఎప్పుడు లాంఛ్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఓ పెద్ద హౌస్ లో సెలబ్రిటీలను 15 వారాల పాటు ఉంచి, వివిధ టాస్క్ లు ఆడించి.. చివరగా విన్నర్ ను డిసైడ్ చేయడమే బిగ్ బాస్ షో. ఇందులో ఆడియన్స్ తమ ఓటింగ్ ద్వారా తమకు నచ్చిన కంటెస్టెంట్ కు సపోర్ట్ చేస్తారు. ఈ బిగ్ బాస్ సందడి మరోసారి దేశాన్ని పట్టి ఊపేయనుంది.

హిందీ బిగ్ బాస్ షోకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న 20వ సీజన్ ను కూడా అతనే నడిపించనున్నాడు. ఈ సీజన్ సెప్...