భారతదేశం, అక్టోబర్ 12 -- Bigg Boss: టెలివిజన్ హిస్టరీలోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ కన్నడ సీజన్ 13 లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. హౌస్‌లో తోటి మహిళా కంటెస్టెంట్స్‌ను టార్గెట్ చేస్తూ బూతులు, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన ఒక మేల్ కంటెస్టెంట్‌పై బిగ్ బాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి ఏకంగా 'రెడ్ కార్డ్' చూపించి హౌస్ నుంచి పంపించేశారు.

బిగ్ బాస్ కన్నడ 13వ సీజన్‌లో కామన్ మేన్ కేటగిరీలో అడుగుపెట్టిన 'మోడరన్ మహాకవి' మంజునాథ్ (మంజ) మొదటి నుంచీ వివాదాస్పద కంటెస్టెంట్‌గానే మారాడు. అయితే, ఇటీవల జరిగిన టాస్క్‌ల సమయంలో అతను హద్దులు మీరుతూ ప్రవర్తించాడు.

ముఖ్యంగా మహిళా కంటెస్టెంట్ క్యారెక్టర్‌ను కించపరిచేలా తీవ్రమైన బూతులు, అసభ్య పదజాలం ఉపయోగించడంతో తోటి హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా తీవ్రంగా ఆగ్రహించారు.

బిగ్...