భారతదేశం, జూన్ 7 -- High Protein Breakfast Foods : ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుడ్డు! రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉండే ఎగ్‌ని కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు వేడివేడిగా ఆమ్లెట్ వేసికుని లాగించేస్తుంటారు. ఈ రెండు రకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు. కొందరు ఆమ్లెట్ తింటే కడుపు నిండుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే బెస్ట్ అని భావిస్తారు. మనం గుడ్డును వండే విధానం, అందులో కలిపే ఇతర పదార్థాల వల్ల దాని పోషక విలువలు ఎలా మారిపోతాయో తెలిస్తే.. మన ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో సులభంగా ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాము....