భారతదేశం, మార్చి 21 -- మీరు ప్రతిరోజూ ప్రయాణించే దారిలో గుంతలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు మిమ్మల్ని విసిగిస్తున్నాయా? కారు లోపల కూర్చున్నప్పుడు రోడ్డుపై ఉన్న గతుకులతో ఇబ్బంది పడకుండా, హాయిగా ప్రయాణించడమే మీ ప్రాధాన్యత అయితే ఇది మీకోసమే! కేవలం గంభీరమైన లుక్ మాత్రమే కాకుండా, భారతీయ రోడ్లపై ప్రయాణానికి కావాల్సిన సరైన సస్పెన్షన్ కలిగిన అత్యుత్తమ ఎస్​యూవీల జాబితాను ఇక్కడ చూసేయండి. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

ధర: రూ. 13.29 లక్షల నుంచి రూ. 25.96 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)

ఈ విభాగంలో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే కార్లలో టాటా సఫారీ ముందుంటుంది. దీని సస్పెన్షన్ సిస్టమ్‌ను చాలా సాఫ్ట్​గా ట్యూన్ చేశారు. ఇది నగరాల్లోని గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. తక్కువ వేగంతో వెళుతున్నప్పుడు రోడ్డుపై ఉండే పద...