భారతదేశం, సెప్టెంబర్ 21 -- మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, వివిధ ఫండ్ల పనితీరును పోల్చి చూడడం చాలా అవసరం. గతంలో ఫండ్స్ ఇచ్చిన రాబడులు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయని కచ్చితంగా చెప్పలేము కానీ, భవిష్యత్ పనితీరు ఎలా ఉండవచ్చో అంచనా వేయడానికి ఈ రిటర్న్స్ ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో, గత ఐదేళ్లుగా 25 శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడిని ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మిడ్‌ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

మిడ్‌ క్యాప్ ఫండ్స్ అంటే, తమ పెట్టుబడుల్లో కనీసం 65శాతం నిధులను మధ్యస్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల స్టాక్స్‌లో పెట్టే ఫండ్స్. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఆగస్టు 31, 2025 నాటి డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో మొత్తం 31 మిడ్‌ క్యాప్ స్కీమ్స్​ ఉన్నాయి. వీటి ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 4.26 లక్షల కోట్లు. ...