భారతదేశం, మే 28 -- Hero Super Splendor XTEC 2.0 launch : దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'.. తన పాపులర్ 125సీసీ కమ్యూటర్ బైక్ శ్రేణిలో సరికొత్త 'హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0' మోడల్‌ను భారత మార్కెట్​లోకి అధికారికంగా విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ సరికొత్త బైక్‌లో కంపెనీ లుక్స్ పరంగా కొన్ని మార్పులు చేయడంతో పాటు అదనపు ఫీచర్లను జోడించింది. వీటన్నింటికీ మించి పాత బైక్ కంటే ఇది ఎక్కువ మైలేజ్ ఇవ్వడమే కాకుండా, తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం.

హీరో సంస్థకు చెందిన గ్లామర్, గ్లామర్ ఎక్స్, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్‌లను నిర్మించిన అదే 125సీసీ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0 కూడా రూపుదిద్దుకుంది. రోజువారీ ఆఫీస్, వ్యాపార అవసరాల కోసం బైక్ వాడే మిడిల్ క్లాస్ ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ అప్‌గ్రేడ...