భారతదేశం, జూలై 18 -- ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అన్ని విభాగాల్లో ఈవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి పరిమాణం, ఆకర్షణీయమైన ధరల కారణంగా చిన్న ఎలక్ట్రిక్ కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా.. భారత మార్కెట్లోకి తన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు 'సైరోస్ ఈవీ'ని ఇటీవలే విడుదల చేసింది.

సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెడుతున్న కియా సైరోస్ ఈవీకి మార్కెట్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ వంటి మోడళ్లు దీనికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టాటా పంచ్ ఈవీతో పోలిస్తే ఈ సరికొత్త కియా సైరోస్ ఈవీ ఏ మేరకు రాణిస్తుందో బ్యాటరీ...