భారతదేశం, ఏప్రిల్ 30 -- Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాడు. ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేశాడు. ఈ టాలీవుడ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది.

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి తిరుమలలో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీళ్ల వెడ్డింగ్ ను గ్రాండ్ గా నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి 11 గంటల 13 నిమిషాల ముహూర్తానికి తిరుమలలోని కర్ణాటక అతిథి భవనం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో వీళ్ల పెళ్లి జరిగింది.

బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి పెళ్లికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మూడు ముళ్లతో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఒక్క...