భారతదేశం, ఆగస్టు 25 -- ఆగస్ట్​ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ) పలు సెలవులను ప్రకటించింది. ఇక ఈ వారం (ఆగస్ట్​ 25 నుంచి 31 వరకు) దేశంలోని వివిధ నగరాల్లో పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల కారణంగా బ్యాంకు​లు 4 రోజుల పాటు మూసి ఉంటాయి. ఈ సెలవులు ఆర్బీఐ 'నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్' కింద వర్తిస్తాయి.

బ్యాంకు లావాదేవీలు లేదా ఇతర ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకునే వారికి ఈ సెలవుల జాబితా చాలా ఉపయోగపడుతుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ వారం ఏయే రోజుల్లో బ్యాంకులు ఎప్పుడెప్పుడు మూసి ఉంటాయో ముందుగానే తెలుసుకుని పనులు చేసుకోవడం మంచిది.

ముఖ్య గమనిక: ప్రాంతీయ పండుగలు, ఆచారాల కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సెలవులు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి, బ్యాంకుకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని స్థానిక బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి...