భారతదేశం, మే 1 -- Telangana Bank holiday : మే నెల వచ్చేసింది. మహారాష్ట్ర దినోత్సవం, మే డే కారణంగా మే మొదటి రోజే దేశవ్యాప్తంగా సెలవు ఉంది. స్టాక్​ మార్కెట్​లు కూడా నేడు మూతపడి ఉన్నాయి. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు కూడా సెలవు ఉంది. ఈ నేపథ్యంలో ఈ మే 2026కి సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

మే 1వ తేదీన దేశంలోని మెజారిటీ నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. మహారాష్ట్ర దినోత్సవం, మే డే, బుద్ధ పూర్ణిమ వంటి సందర్భాల వల్ల హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే అహ్మదాబాద్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, జైపూర్ వంటి ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచే ఉంటాయి.

మే నెలలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి:

మే 9: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భం...