భారతదేశం, జూన్ 21 -- Balan The Boy: మలయాళంలో డిఫరెంట్ జోనర్ల సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ మూవీస్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ 'బాలన్ ది బాయ్' మూవీ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు.

టాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఇవాళ (జూన్ 21) అన్నపూర్ణ స్టూడియోలో బాలన్ ది బాయ్ మూవీ స్పెషల్ షో వేశారు. ఈ మూవీ చూసిన వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ఇంప్రెస్ అయ్యాడు.

''సినిమా చాలా బాగుంది. వచ్చేటప్పుడు ఒకలాగా ఉన్నా. వెళ్లేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఈ మూవీని ఇక్కడకు తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక్క క్యారెక్టర్ అని కాదు.. ఈ సినిమా ఓ డిఫరెంట్ వరల్డ్. తెలుగు డబ్ అయినా, మలయాళంలో అయినా, ఏ భాషలోనైనా సరే వచ్చి థియేటర్లలో చూడండి. ఈ సినిమా ను మిస్ అవొద్దు'' అని ...