భారతదేశం, జూలై 21 -- భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా డిమాండ్‌తో పాటు విక్రయాలు కూడా భారీగా పుంజుకుంటున్నాయి. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాహన నిర్వహణ వ్యయం భారంగా మారడం, అలాగే ఈ20 ఇంధన ప్రభావంపై వాహనదారుల్లో ఉన్న సందేహాలు, భయాలు.. వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు వేగంగా నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్‌లో సుదీర్ఘకాలంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ ముందంజలో ఉన్నాయి.

రోజువారీ ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా, ప్రాక్టికల్ డిజైన్‌తో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్​గా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ రూపొందించగా, అది ఐక్యూబ్‌గా ప్రాచుర్యం పొందింది. మరోవైపు బజాజ్ చేతక్ క్లాసిక్ వింటేజ్ లుక్‌తో వస్తూనే, నిత్యం ఆఫీసులు, పనులకు వెళ్లేవారికి తగ్గట...