భారతదేశం, మార్చి 14 -- సింగర్ బాద్‌షాకు బిగ్ షాక్ తగిలింది. ఈ పాపులర్ ర్యాపర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాద్‌షా కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు. గడువులోగా తమ ముందు హాజరుకావడంలో విఫలమైన ర్యాపర్ బాద్‌షాను అరెస్ట్ చేయాలని పోలీసులను హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది.

రీసెంట్ గా బాద్‌షా రిలీజ్ చేసిన హర్యానవీ మ్యూజిక్ వీడియో 'తతీరీ' తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇందులో స్కూల్ యూనిఫామ్ లో ఉన్న అమ్మాయిలతో అసభ్యకరమైన డ్యాన్స్ లు వేయించడంతో పాటు పాటలోని సాహిత్యంలోనే అనుచితమైన పదాలు వాడాడని బాద్‌షాపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే హర్యానాలో అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ సాంగ్ పై సీరియస్ అయిన హర్యానా మహిళా కమిషన్ తమ ముందు హాజరు కావాలని బాద్‌షాకు నోటీసులు పంపించింది.

పానిపట్ లోని కమిషన్ ఆఫీస్ లో మార్చి 13 మధ్యాహ్నం 3 గంటల్ల...