భారతదేశం, నవంబర్ 11 -- Babu Mohan The Paradise: తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ టైమింగ్‌తో దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన వర్సటైల్ నటుడు బాబు మోహన్. ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, నచ్చిన పాత్రలు వచ్చినప్పుడు అలరిస్తున్న ఈ సీనియర్ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ నిర్మాణ వర్గాల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరును బయటపెడుతూ ఆయన ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్వ్యూలో 'ది ప్యారడైజ్' సినిమా అనుభవాన్ని వివరిస్తూ బాబు మోహన్ అసలు ఏం జరిగిందో వెల్లడించారు. "ఈ సినిమా కోసం మేకర్స్ నన్ను సంప్రదించారు. ప్రత్యేకంగా పిలిచి గెటప్ వేశారు, లుక్ టెస్ట్ చేశారు. లుక్ చూసి 'బ్రహ్మాండం...