భారతదేశం, జూలై 29 -- Azadi 501 OTT: ఇటీవలి కాలంలో రియల్ లైఫ్ కార్పొరేట్ స్కామ్‌లు, ఫైనాన్షియల్ మోసాల ఆధారంగా రూపుదిద్దుకునే వెబ్ సిరీస్‌లకు ఓటీటీ స్పేస్‌లో మంచి క్రేజ్ లభిస్తోంది. 'స్కామ్ 1992', 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్' వంటి సిరీస్‌ల విజయం తర్వాత.. ఇప్పుడు 'ఆజాదీ 501' (Azadi 501) సిరీస్ వచ్చేసింది.

భారతీయ వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెలుగులో రూపొందిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఆజాదీ 501' . హర్ష వర్ధన్ కీలక పాత్ర పోషించిన ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ నేటి నుంచి (జూలై 29, 2026) ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఆరు ఎపిసోడ్లతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

కొన్నేళ్ల క్రితం ఇండియాలో అతి తక్కువ ధరకే (కేవలం రూ.251 లకే) అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ ఒక ...