భారతదేశం, ఆగస్టు 14 -- Awarapan 2 box office: ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ స్టార్ట్ అయింది. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఊహించని రేంజ్‌లో 'ఆవారాపన్ 2' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన కేవలం 9 గంటల్లోనే పార్ట్ 1 సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను తిరగరాసి బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

2007లో వచ్చిన మొదటి భాగం 'ఆవారాపన్' థియేటర్లలో ప్లాప్‌గా నిలిచి, తన పూర్తి రన్‌లో కేవలం రూ. 7.76 కోట్లు మాత్రమే రాబట్టింది. నాటి సినిమా మొదటి రోజు కేవలం రూ. 79 లక్షలు, ఫస్ట్ వీకెండ్‌లో రూ. 2.88 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

కానీ ఇప్పుడు వచ్చిన సీక్వెల్ 'ఆవారాపన్ 2' సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజు సాయంత్రం 6 గంటల సమయానికే రూ. 12.05 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్...