భారతదేశం, అక్టోబర్ 30 -- ఉన్నత విద్య, ఉద్యోగం, పర్యాటకం లేదా వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీసా విధానాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చడంలో భాగంగా బయోమెట్రిక్ సేకరించే నిబంధనలను భారత్‌తో పాటు దాదాపు 60 దేశాలకు విస్తరిస్తున్నట్లు దిలోని ఆస్ట్రేలియన్ హైకమిషన్ అధికారికంగా వెల్లడించింది.

ఈ సరికొత్త నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 26, 2026 నాటి నుంచి లేదా ఆ తర్వాత కొత్తగా ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ వేలిముద్రలు, ముఖ చిత్రాన్ని బయోమెట్రిక్ రూపంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు ఆస్ట్రేలియాకు పయనమవుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల ను...