భారతదేశం, ఏప్రిల్ 8 -- Atlee on Raaka: పుష్ప సెన్సేషన్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది కేవలం సినిమా కాదు, 18 ఏళ్ల నిరీక్షణ అని అట్లీ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా రాకా మూవీ గురించిన చర్చే జరుగుతోంది.

ప్రేక్షకులు ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో, వాటిని తలకిందులు చేస్తూ 'రాకా' ఫస్ట్ లుక్ విడుదలైంది. అల్లు అర్జున్ ఇప్పటివరకు పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా, అసలు గుర్తుపట్టలేనంత కొత్తగా ఇందులో కనిపిస్తున్నాడు.

గుండుతో, అత్యంత క్రూరమైన కళ్లతో, ఒక చేతికి తోడేలు పంజాలాంటి కవచంతో ఉన్న బన్నీ లుక్ చూస్తుంటే.. ఇది ఒక డార్క్ సినిమాటిక్ ఎక్స్‌పెరిమెంట్ అని స్పష్టమవుతోంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ చేస్తున్న ఈ సాహసం ట...