Assam floods : కంటతడి పెట్టిస్తున్న అసోం దుస్థితి.. వరదలకు విలవిల- రంగంలోకి సల్మాన్ ఖాన్!
భారతదేశం, జూలై 31 -- ఈశాన్య రాష్ట్రమైన అసోంను ప్రళయకర వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ప్రవాహంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. గురువారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఏకంగా 80కి చేరినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎస్డీఎంఏ) అధికారికంగా ధృవీకరించింది.
ప్రస్తుతం చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారు 2.12 లక్షల మంది ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం నాటికి నాలుగు జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు బాధితులుగా ఉండగా, గురువారానికి నీటి మట్టం కాస్త తగ్గడంతో బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి.
చరాయిదేవ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.