భారతదేశం, సెప్టెంబర్ 20 -- Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఇవాళ (సెప్టెంబర్ 20) ఈ ఆసియా క్రీడల షూటింగ్ లో భారత్ కు రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ టీమ్, ఇండివిజువల్ విభాగంలో రజత పతకాలు ఖాతాలో వేసుకుంది.

ఆసియా క్రీడలు 2026లో ఐచి జనరల్ షూటింగ్ రేంజ్‌ వేదికగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 27 ఏళ్ల ఎలవెనిల్ వలరివన్ అదరగొట్టింది. మొదటి 5 షాట్ల సిరీస్ నుంచే లీడ్‌ సాధించిన ఆమె, 24 షాట్ల ఫైనల్లో 20వ షాట్ వరకు మొదటి స్థానంలోనే కొనసాగింది. అయితే చివరి నాలుగు షాట్లలో స్థానిక జపాన్ క్రీడాకారిణి తైచి హినాటా ఊహించని రీతిలో పుంజుకుంది.

చివరకు హినాటా 253.0 పాయింట్లతో గేమ్స్ రికార్డును తిరగరాస్తూ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఎలవెనిల్ 252.4 పాయింట్లతో రజతాన్ని అందుకుంది. దక...