Ashwin SRH: చెత్త బ్యాటింగ్.. అతన్ని తీసిపారేయండి: సన్ రైజర్స్ తీరుపై అశ్విన్ ఘాటు కామెంట్స్
భారతదేశం, మే 28 -- Ashwin SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శనపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు వ్యవహరించిన తీరును, ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు పారేసుకున్న విధానాన్ని అశ్విన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఏకంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ భవిష్యత్తుపై ఫ్రాంచైజీ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కుండబద్దలు కొట్టారు.
రాజస్థాన్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టోర్నీ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్.. ఈ అత్యంత కీలకమైన నాకౌట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.