భారతదేశం, ఏప్రిల్ 28 -- Ashu Reddy: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడి దగ్గర డబ్బు వసూలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తాజాగా తాను దోచుకున్న డబ్బులో కొంత మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. బాధితుడి ధర్మేంద్రకు ఆమె పంపిన ఆడియో మెసేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో మే వరకు తనకు టైమ్ ఇస్తే రూ.కోటిన్నర తిరిగి ఇస్తానని ఆమె చెప్పింది.

అషు రెడ్డి పంపిన వాయిస్ మెసేజ్ లో ధర్మేంద్రను ఓవైపు రిక్వెస్ట్ చేస్తూనే మరోవైపు కేసు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చింది.

"ప్రవీణ అక్కకి కాల్ చేసావట. అందుకే నేను మెసేజ్ పెడుతున్నాను. నాకు మే వరకు టైమ్ ఇవ్వు. రూ.1.5 కోట్లు తిరిగి ఇస్తాను. మిగిలిన డబ్బు నేను జీవితంలో సెటిలైన తర్వాత ఇస్తాను. అవి కూడా ఇవ్వను అని అనడం లేదు. కానీ ఈ వివాదంలోకి నా అక్క, తల్లిని లాగొద్దు. నా తరఫున ప్రవీణ అక్క, వేణు స్వామి మధ్యవర్త...