భారతదేశం, ఫిబ్రవరి 18 -- చాలామంది శుభ ఫలితాలు కలగాలని, మంచి జరగాలని రకరకాల రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్నాలు జాతకంలో ఉన్న సమస్యలను తొలగించి, అనేక విధాలుగా లాభాలు కలిగేటట్టు చేస్తాయి. అయితే రత్నాలను లేదా ఏదైనా ప్రత్యేక ఉంగరాలను ధరించేటప్పుడు జ్యోతిష్యులను సంప్రదించి ధరించడం మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

చాలా మంది వారికి ఏ లోహం కలిసి వస్తుందో తెలుసుకుని వాటిని ధరిస్తూ ఉంటారు. బంగారం, వెండి, రాగి ఇలా చాలా రకాల లోహాలు ఉన్నాయి. అయితే 8 లోహాలతో కలిపి చేసేది అష్టధాతు. అష్టధాతు సానుకూల శక్తులను తీసుకురావడానికి సహాయం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అష్టధాతు ఉంగరాన్ని ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.

చాలా మంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక సమస్యలు, ...