భారతదేశం, ఏప్రిల్ 12 -- Asha Bhosle: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతార నేలకొరిగింది. తన మధుర గాత్రంతో తరాల అంతరాన్ని చెరిపేసిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఆశా భోంస్లే (92) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.

శనివారం రాత్రి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు, గుండె సమస్యలు తలెత్తడంతో ఆశా భోంస్లేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. ఆమె మరణవార్తను కుమారుడు ఆనంద్ భోంస్లే ధృవీకరించారు. రేపు (ఏప్రిల్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

1933లో సంగీత నేపథ్యం ఉన్న మంగేష్కర్ కుటుంబంలో ఆశా జన్మించారు. ఆమె అక్క, దివంగత లతా మంగేష్కర్ భారతీయ సంగీతంలో ఒక శిఖరమైతే, ఆశా భోంస్లే తనకంటూ ...