భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ రాకతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి కోడింగ్ రాసే రోజులు త్వరలోనే ముగిసిపోనున్నాయా? టెక్ దిగ్గజాల మాటలు వింటుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫై కో-సీఈఓ గుస్టావ్ సోడర్‌స్ట్రోమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. తమ డెవలపర్లు కోడ్స్​ రాసి చాలా కాలమైపోయిందని ఆయన అన్నారు.

స్పాటిఫైలోని ఉత్తమ డెవలపర్లు డిసెంబర్ 2025 నుంచి ఒక్క లైన్ కోడ్ కూడా స్వయంగా రాయలేదని సోడర్‌స్ట్రోమ్ వెల్లడించారు. దీనికి కారణం 'హాంక్​' అనే వారి అంతర్గత ఏఐ సిస్టమ్ అని వివరించారు.

ఈ సిస్టమ్ ద్వారా ఇంజనీర్లు తమ ఆఫీసుకి వెళ్లే దారిలో మొబైల్ నుంచే క్లాడ్ ఏఐకి సూచనలు ఇస్తారు.

ఏదైనా బగ్ (తప్పు) సరిచేయాలన్నా లేదా కొత్త ఫీచర్ చే...