భారతదేశం, జూలై 19 -- Article 370 OTT: భారతీయ చలనచిత్ర రంగంలో కేవలం కమర్షియల్ హంగులతోనే కాకుండా, వాస్తవిక సంఘటనలను అంతే గ్రిప్పింగ్‌గా తెరకెక్కించే సినిమాలకు ఓటీటీ స్పేస్‌లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన 'ఆర్టికల్ 370' కూడా ఓటీటీలో అదరగొడుతోంది.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వెనుక జరిగిన రాజకీయ, వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య సుహాస్ జంభాలే ఆర్టికల్ 370 చిత్రాన్ని అద్భుతంగా మలిచాడు. తాజాగా ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ చిత్రం ఏకంగా మూడు ప్రధాన విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని బాలీవుడ్‌లో టాప్ విన్నర్‌గా నిలిచింది.

2024లో వచ్చిన 'ఆర్టికల్ 370' మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ థ్రిల్లర్ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ...