భారతదేశం, అక్టోబర్ 26 -- బంగాళాఖాతంలో మళ్లీ కల్లోలం మొదలైంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 26 నాటికి తుపానుగా, అక్టోబర్ 27 నాటికి 'తీవ్ర తుపాను'గా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

అర్నబ్ తుపాను నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను, మత్స్యకారులను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోంది.

ఐఎండీ నివేదిక ప్రకారం.. ఈ అర్నబ్ తుపాను తీవ్ర రూపం దాల్చిన తర్వాత అక్టోబర్ 28న బాపట్ల - విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ - యానాం తీరాన్ని దాటే ...