భారతదేశం, ఆగస్టు 18 -- భారతీయ సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం. విశాఖపట్నం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇదివరకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 10,355 మంది అభ్యర్థులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ర్యాలీ నిర్వహణ, ఏర్పాట్లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ సేవకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని ఆయన ఆదేశించారు.

ర్యాలీ సఫీగా సాగేందుకు రవాణా సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, సమాచార సాంకేతిక వసతులు, మైక్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు....