భారతదేశం, సెప్టెంబర్ 4 -- Arjun Sarja: 'మిస్ యూ' అనే మాట వెనుక ఉన్న నిజమైన బాధ ఏంటో దివంగత సౌందర్య మరణం తర్వాతే తనకు అర్థమైందంటూ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సంచలన వ్యాఖ్యలు చేశారు. వెండితెరపై రగ్గడ్ లుక్స్, కండల వీరుడిగా కనిపించే అర్జున్.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌందర్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

అర్జున్ సర్జా సినీ కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం తీవ్రంగా కష్టపడుతున్న సమయంలో సౌందర్య ఆయనకు కొండంత అండగా నిలిచారు. కేవలం తోటి నటిగానే కాకుండా, పర్సనల్ లైఫ్‌లోనూ కష్టసుఖాలు పంచుకునే ఆప్తమిత్రురాలిగా ఉండేది. ఆ రోజుల్లో అర్జున్ సర్జా, సౌందర్య, హీరో జగపతి బాబు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్‌గా మెలిగేవారు.

రెండు దశాబ్దాలకు పైగా పవర్ ప్యాక్డ్ యాక్షన్ రోల్స్ చేస్తూ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుక...