భారతదేశం, మార్చి 15 -- ఇంటర్‌సిటీ మొబిలిటీ బ్రాండ్ అయిన ఇంటర్‌సిటీ స్మార్ట్‌బస్ విజయవాడ-బెంగళూరు మార్గంలో ప్రయాణికుల ఆరోగ్యం, సౌకర్యంపై దృష్టి సారించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఎనేబుల్డ్ ఇంటర్‌సిటీ బస్సు సేవలను ప్రారంభించింది. విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP - ట్రాఫిక్) షెరీన్ బేగం విజయవాడలో భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)-ఆధారిత ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా షెరీన్ బేగం మాట్లాడుతూ.. విజయవాడ-బెంగళూరు, బెంగళూరు-విజయవాడ కారిడార్‌లలో స్మార్ట్‌బస్ AQI సేవలను ప్రారంభించడం భారతదేశ రవాణా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.

ముఖ్యంగా దూర ప్రయాణాల సమయంలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి బస్సుల లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడంపై ఈ చొరవ దృష్టి సారించిందని పేర్కొన్నారు. 'సుదూర ప్రయ...